ఈ పుస్తకంలో సుమారు 90 పుటలు - సినిమా, సాహిత్యరంగాల్లో కొందరు మహావ్యక్తుల జీవితాలు, తెలుగు ప్రజలకు వారిచ్చిన శాశ్వత సాంస్కృతిక సంపద గురించి వ్రాసన వ్యాసాలు. గూడవల్లి రామబ్రహ్మం, బి.ఎన్‌.రెడ్డి, విశ్వనాధ్‌, కె.ఎస్‌.ప్రకాశరావుల వంటి ఘనాపాఠీ దర్శకులు: బాపు వంటి అసమాన ప్రతిభావంతులు, కాంచనమాల, భానుమగ వంటి నటీమణులు, జగ్గయ్య, గుమ్మడి, మిక్కిలినేని వంటి నటశ్రేష్ఠులు, శ్రీశ్రీ, కొండవటిగంటి, దాశరధి, జాషువా, తుమ్మల సీతారామమూర్తి, ఏటుకూరి వెంకటనరసయ్య, బొల్లిముంత, సి.నా.రే వంటి మహాకవులు, రచయితలు, - గురించి వ్రాసిన వ్యాసాలు 'కొండను అద్దంలో చూపినట్లే' అనుకోవాలి. ఒక్కొక్కరిపై ఒక్కొక్క పెద్ద గ్రంథాన్ని వ్రాయడానికి వీలున్న జీవితాలను మూడు నాలుగు పుటల్లో చూపడం అంత తేలికైన పనేనా? అయినా ఆ పనిని సమర్ధంగానే నిర్వర్తించారు డాక్టరుగారు. నేటి యువతపై చలనచిత్రాల ప్రభావం అనే వ్యాసంలో కొన్ని గమనించి తీరవలసిన అంశాలను ప్రస్తావించారు. 'డాక్టర్‌ దక్షిణామూర్తిగారి వ్యాసాలు' సమాజానికి పనికొచ్చే ఒక మంచి పుస్తకం. తెలుగు ప్రజలు రచయితకు సర్వదా కృతజ్ఞులై ఉంటారు. - డాక్టర్‌ సామల రమేష్‌బాబు

Write a review

Note: HTML is not translated!
Bad           Good