దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య కాగా ఆ సుందర్యను అందకు పురికొల్పిన వ్యక్తి దాదా అమీర్ హైదర్ కాన్. అందుకే ఆయనను వైతాళికుడు అని చెప్పడం పూర్తిగా సమంజసం. ఆయన జ్ఞాపకాలు తెప్పించి ప్రచురింపచేయడంలో ఎంతో శ్రద్ధ తీసుకున్న సుందరయ్య తన నివాళిలో ఈ సంగతులన్నీ రాశారు. ఇంతకూ ఈ జ్ఞాపకాలు మొదటిసారి తెలుగులోనే వెలువడ్డం మనకు గర్వకారణమైతే అందుకు ఆయన చూపించిన శ్రద్ధ ఏకైక కారణం. ఉద్యమాలను ముఖ్యంగా కమ్యూనిస్టు పార్టీని నిర్మిచేందుకు ఎందరు యోధులు అంకితమై పోరాడాలో ఎన్ని త్యాగాలు చేశారో తెలుసుకోవడానికి ఈ పుస్తకం గొప్పగా దోహదపడుతుంది. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good