గాంధీ గొప్పతనాన్ని తెలుసుకోవాలంటే ఆయనలో పూర్తి పరివర్తనను తీసుకువచ్చిన దక్షిణాఫ్రికాలో ఆయన జీవితాన్ని తెలుసుకోవాలి. 23 ఏళ్ళ వయస్సులో దక్షిణాఫ్రికాకు గాంధీ వెళ్ళి ఉండకపోతే ఆయన స్వాతంత్య్రోద్యమంలో పాల్గొనేవారు కాదన్నది నిర్వివాదాంశం. ఒక రకంగా చెప్పాలంటే దక్షిణాఫ్రికా తన వద్దకు వచ్చిన బారిష్టర్‌ గాంధీని మహాత్మాగాంధీగా మార్చి భారతదేశానికి మార్చి పంపించింది. గాంధీ 21 సంవత్సరాలు దక్షిణాఫ్రికాలో గడిపారని పాశ్చాత్య ప్రపంచంలో ఎంతమందికి తెలుసు? ఈ 21 సంవత్సరాల్లోనే అహింస, సత్యాగ్రహం, అస్పృశ్యత, శారీరక వ్రమ, స్త్రీ చైతన్యం, కుటీర పరిశ్రమలు, హిందూ ముస్లిం ఐక్యత, మద్య నిషేధం మొదలైన వాటికి సిద్ధాంతాల రూపకల్పన అయి ప్రపంచానికి మార్గదర్శకం అయ్యాయన్నది చారిత్రక వాస్తవం. ఈ సిద్ధాంతాలను ఆయన భారతదేశానికి తీసుకురావడమే కాదు, దక్షిణాఫ్రికా ప్రజలకు దారుణమైన వివక్షకు వ్యతిరేకంగా పోరాడడానికి ఈ సిద్ధాంతాలను ఆయుధాలుగా అందించి వచ్చారు. భారతదేశంలో సామాజిక సమస్యలను అవగాహన చేసుకుని పోరాడడానికి కావల్సిన సిద్ధాంతాలను అందించటమే కాదు, గాంధీ తన జీవితాన్ని ప్రపంచానికి మార్గదర్శకంగా తీర్చిదిద్దుకునేందుకు దక్షిణాఫ్రికా భూమిక అయింది.

Pages : 47

Write a review

Note: HTML is not translated!
Bad           Good