సత్ప్రవర్తనతో జీవించగలగడమే అసలైన ఆధ్యాత్మిక జీవితం. ఏ కర్మల వల్ల మనమంతా ఈ జనన మరణ చక్రానికి బందీలు అవుతున్నామో, తిరిగి అలాంటి కొత్త కర్మలు చేసి వాటిలో చిక్కుకోకుండా మనల్ని కాపాడుకుంటూ, గత జన్మలో చేయగా పేరుకుని వున్న కర్మరాశిని తగ్గించుకోవడం అన్నదే హిందూ మతం గట్టిగా బోధిస్తున్నది. ఆధ్యాత్మిక సాధకులు చేసే జపం, తపం, పూజ, ధ్యానం, యజ్ఞయాగాదులు ఈ కర్మను వదిలించుకోవడానికే.

ఒకే విషయాన్ని వివిధ కోణాల్నించి పదే పదే చెప్పడానికి కారణం. ఇలాంటివి చదివినంతసేపూ అర్ధమైనట్లుగా వుంటాయి. పుస్తకం మూసేశాక ఆచరణకి అవి గుర్తురావు. ఆధ్యాత్మికత అంటే ఆచరణ, ఆచరణ, ఆచరణే. కాబట్టి అవి పాఠకుల మనసుల్లో ఇంకాలని పదే పదే చెప్పడం జరిగింది. ఆధ్యాత్మిక విషయాలు త్వరగా పట్టుబడవు. ఇందుకు కారణం మన మీద మాయ సదా పనిచేస్తుండడమే. మనలోని అన్ని దుర్గుణాలను పోగొట్టుకోవడానికి ఆధ్యాత్మిక పుస్తకాలు తరచు చదవాల్సిన అవసరం ఉంది. అందుకనే ఆధ్యాత్మిక పుస్తకాలు సత్సంగంతో సమానం అని పెద్దలు చెప్తారు. ఈ దైవంవైపు పుస్తకం అందుకు ఉపయోగపడుతుంది. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good