'నవ తెలంగాణ' దినపత్రిక ప్రధమ వార్షిక ప్రత్యేక ప్రచురణ సీరీస్‌లో ఇది ఒకటి. ప్రతిరోజు ప్రచురితమయ్యే సంపాదకీయాల నుండి కొన్నింటిని ఎంపిక చేసి 'దైనిక వ్యాఖ్య'ను పత్రిక ఎడిటర్‌ ఎస్‌.వీరయ్య వర్తమాన అంశాలపై వారం వారం రాస్తున్న వ్యాసాల నుండి 'సమకాలీనం'ను, మొత్తం ప్రజల, ప్రత్యేకించి దళితులు, గిరిజనులు, బీసీలు మొదలైన ప్రజానీకపు సంస్కృతీ సంప్రదాయాలను, పర్వదినాలను వివరిస్తూ, విశ్లేషిస్తూ సాగుతున్న 'జాతర' నుండి 'సంస్కృతీ సౌరభాలు'ను, కుల వివక్ష, కుల సమస్య పరిష్కారాలను వివరిస్తున్న 'చార్వాక' నుండి 'సామాజిక దృక్పథం'ను, సాహిత్య రంగంలో వ్యక్తమవుతున్న వివిధ ధోరణులు, ప్రక్రియలు, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఈ రంగంలో ముందుకొస్తున్న వివిధ అంశాలు, సాహితీ రంగ ప్రముఖులు వారి ప్రత్యేకతలు, విశిష్టతలను వివరిస్తున్న 'దర్వాజ' నుండి 'సాహితీ సుమాలు'ను అందిస్తున్నాము. ఈ ఐదు పుస్తకాలు ఒక్కొక్కటి వంద పేజీలు లోపుగానే ఉన్నప్పటికీ నవతెలంగాణ దినపత్రిక తీరుతెన్నులను సూక్ష్మంలో మోక్షంలా అద్దం పడతాయి. అంతేకాదు, ఈ పుస్తకం ఒక్కొక్కటి దేనికదే ఆయా అంశాల అవగాహనకు చక్కగా దోహదపడుతుంది.

Pages : 96

Write a review

Note: HTML is not translated!
Bad           Good