Rs.80.00
Out Of Stock
-
+
సామాజికశాస్త్ర పరిశీలనతో చూసినప్పుడు దానశీలతలో మానవీయకోణం ఉంది. మైత్రీ, కరుణ, దయ లాంటి భావాలవల్ల మనిషి తోటి మనిషిని ప్రేమించే స్వాభావిక గుణానికి దానం మరింత దోహదమవుతుంది. మనుషుల మధ్య నమ్మకాన్ని, సోదరత్వాన్ని పెంపొందించడంలో దానం కీలకపాత్ర వహిస్తుంది.
ఒకరు ఇవ్వటం, మరొకరు పుచ్చుకోవటం అనేది లేకుండా అంటే దాత-గ్రహీతలు లేని సమతారాజ్య స్థాపన మానవాళి చిరకాల ఆకాంక్ష. అయితే ఆ ఉదాత్తమైన లక్ష్యం నెరవేరేంతవరకూ సమాజం ఉన్నచోటనే నిశ్చలంగా ఉండదు. ముందుకు సాగుతూనే ఉంటుంది. ఈ సాగే సమాజ ప్రయాణంలో దానం పాత్ర బృహత్తరమైనది. అందుకే బౌద్ధం దశపారమితలలో దానానికి అగ్రాసనం వేసింది.
Pages : 124