'ఎవర్నో చంపమని నన్నెందుకు అడుగుతున్నారు?''

''ఉత్తరం కావాలంటే పోస్ట్‌మేన్‌కి ఎలా అడుగుతారో, అలా హత్య
చేయించాలంటే హంతకినే అడగాలి''
అతని వంక అయోమయంగా చూసింది ఉజ్వల. ఆమె ఎక్స్‌పెక్ట్‌ చేయలేదిలాంటి బ్లాక్‌మెయిల్‌.
''ఎవర్నీ?''
''నా భార్యని''
''ఎందుకని?''
''నా కారణాలు నాకున్నాయి''. ''మాట వరుసకి చేస్తే'' అడిగింది ఉజ్వల.
''మీ నెగెటివ్స్‌, ఫోటోలు మీకిచ్చేస్తాను. కోర్టు మిమ్మల్ని శిక్షించదు. అసలా కేసు యాక్సిడెంట్‌ డెత్‌ గానే మూసేస్తారు.''
''లేకపోతే''
ఎవరి కర్మ వారిది. నేను నా భార్య వంట తింటాను. నీవు జైలు కూడు తింటావు.''
చంద్రమౌళి విమనైజర్‌. భార్య శోభతో చెడింది. ఇంకో అమ్మాయితో లంకె కుదిరింది. దాంతో భార్యని చంపమని ఓ అమాయకురాలిని బ్యాక్‌మెయిల్‌ చేయడం మొదలు పెట్డాడు. ఆమె సాలెగూటిలోంచి బయటపడాలనుకునే కొద్దీ అది మరింతగా బిగుసుకోసాగింది. ప్రమోషన్‌ కోసం భార్యని పై ఆఫీసర్‌ దగ్గరికి సైతం పంపాలనుకునే చంద్రమౌళి, భర్త మీది కోపంతో మరిది మైఖేల్‌కు దగ్గరయ్యే శోభ, అనుకోకుండా దయాకర్‌ హత్య కేసుల వ్యవహారంలో చిక్కుకునే ఉజ్వల- ఇలా మధ్యతరగతి పాత్రలతో కథని జవనాశ్వంలా పరిగెత్తించే ఆంధ్రుల అభిమాన రచయిత మల్లాది వెంకటకృష్ణమూర్తి రాసిన మరో క్రైమ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ డి ఫర్‌ డెత్‌ 

Write a review

Note: HTML is not translated!
Bad           Good