ఆశ్రిత పెట్టుబడిదారి విధానం - పర్యవసానాలు
ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం ఇంగ్లీషులో 'క్రోని కేపిటలిజం' అన్న మాటగా యిటీవల చాలా ప్రాచుర్యం వచ్చింది. దాని సందర్భం తెలియక తికమక పడటం అందరికి విదితమే. దీన్ని ఒక ప్రత్యేక సందర్భంగా కాకుండా పెట్టుబడిదారీ విధానంలో భాగంగా అర్థం చేసుకొంటే ఏ గందరగోళం వుండదు.  అందుకే ఈ పెట్టుబడిదారీ విధానం ఎలా వచ్చిందో అర్థం తెలుసుకుందాం.  భారతదేశంలో ఈ ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం ఎప్పుడు ప్రవేశించింది, దాని పర్యవసానాలు ఏమిటి అన్నది కూడా పరిశీలిద్దాం.
ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం 1997 తరువాత బహుళ ప్రాచుర్యంలోకి వచ్చింది.  దానికి కారణం ఆగ్నేయ ఆసియా దేశాలైన ఫిలిఫ్పైన్స్‌, ఇడోనేషియా, దక్షిణ కొరియా, థాయ్‌లాండ్‌ వంటి దేశాల్లో 1997లో వచ్చిన ఆర్థిక సంక్షోభాన్ని వివరించటానికి ఆర్ధిక శాస్త్రవేత్తలు 'క్రోని కేపిటలిజం' అన్న మాటను ఉపయోగించారు.  ఈ దేశాల్లో వచ్చిన ఆర్థిక సంక్షోభం, పెట్టుబడిదారీ సంక్షోభం కాదని, ఈ దేశాలలో వుండే ప్రభుత్వాలు (రాజ్యం) కొద్ది మంది చేతుల్లో బందీగా వుంటూ తమ బంధువులకు, ఆశ్రితులకు కావలసిన విధంగా లావేదేవీలు జరపడంతో యిక్కడ విపత్కరమైన సంక్షోభం వచ్చింది.  అది పూర్తిగా యిక్కడ రాజ్యాన్ని నిర్వహించిన ఫిలిప్పీన్స్‌లో, మార్కోస్‌ ఆయన భార్య వారి ఆశ్రితుల అతిఉత్సాహం మూలంగా వచ్చింది అని వివరించడం జరిగింది.  దక్షిణ కొరియా, థాయ్‌లాండ్‌, ఇడోనేషియాల్లో కూడా దే మాదిరిగా ఆశ్రితుల విపరీత ధనకాంక్ష మూలంగా వచ్చిందని పేర్కొన్నారు.  మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళేకొద్దీ ప్రపంచ బ్యాంక్‌ ఆర్ధికశాస్త్రవేత్తలు, మన దేశంలో వారి మిత్రులు ప్రచురించిన పుస్తకాలు, పత్రాలు, ప్రచారాన్ని ఒకసారి తొంగి చూడాల్సివుంది.  ఆ రోజుల్లో 'ఆసియా పులులు' అని వీరు పొగిడిన దేశాలే యివి.  ఆ దేశాల ఆర్ధిక పద్ధతులకు అవి అవలంబిస్తున్న సంస్కరణలను భారతదేశం 'బోనులో బందించబడ్డ ఏనుగు లేక పులి' అని దాన్ని సంస్కరణల ద్వారా విడుదల చేస్తే ఆగ్నేయ ఆసియా దేశాలను మించి ఎదుగుతుందని వ్యాఖ్యలు చేశారు......

Write a review

Note: HTML is not translated!
Bad           Good