(విశ్వనాథ సత్యనారాయణగారికి కె.రామచంద్రమూర్తిగారికి మధ్య ముఖాముఖిగా దీనిని 22-5-1973 నాటి ఆంగ్లదినపత్రిక డెక్కన్క్రానికల్లో ప్రచురించారు.)
జాతి నిర్మాణంలో రాజకీయాల్లో మేధావులు ఎటువంటి పాత్ర పోషించాలి? ముఖ్యమంత్రిగా పి.వి.నరసింహారావుగారి వైఫల్యానికి కారణం ఏమిటి?
ఈ ప్రశ్నమున కవులను కూడ చేర్చుట కవకాశము కలదు. ఒకడు కవియగునంత మాత్రమున మేధావి కాజాలడు. మేధావులందరు కావులు కారు. కవిత్వము, రాజకీయములు భిన్నధ్రువములు. అయినను కవిత్వమున కొన్ని రాజకీయములుండునటులే రాజకీయములందు కొంత కవిత్వము కన్పించును. రాజకీయ ఘనాపాఠీలు ప్రసంగించు తరుణమున వారు తమ ప్రసంగముల నెల్లప్పుడు కవితామయము గావింతురు. అటుల జరుగునప్పుడు వారు శ్రోతల హృదయ వీణియ తంత్రులన్నింటిని మీటుదురు. గ్రంథకర్త లెల్లరు విప్లవ సృజనకు పూనుకొనెదరను విషయమును తరచుగ ప్రజలు తప్పుగా అర్థము చేసుకొనుట కలదు. అది ఫ్రాన్స్ దేశమున జరియుండవచ్చును. వోల్టేరు వంటివారు అటుల చేసిరని వారనుచుందురు.
ప్రపంచకమున గొప్ప గొప్ప విప్లవములు ఏతావున తారసిల్లినను వాటి వెనుక ప్రధానముగ తొలగించబడిన అసంతుష్టులగు సైనికులు, దట్టించబడిన ఆయుధములతో వాటికి తన్నుడుగా నిలుతురు. ఈ దేశమునకూడ మనమెన్నియో అంతర్గత పోరాటములను చూచితిమి. విజయమెల్లప్పుడు తుపాకీ గుండుదే. ఆ కారణము చేతనే ఎల్లవేళల ప్రభుత్వమునదే పైచేయి. సాధారణముగ ప్రజవి అరకొర ఆలోచనలు. వారు నిశ్చలముగ యాలోచింపజాలక పోవుటకు కారణము వారిని మనోద్వేగములు చుట్టుముట్టుటయే. మనోద్వేగములు వాటికవి నిష్ప్రయోజకములు. కవిత్వమనునది రమారవి ప్రపంచకము నందలి సమస్త విషయములకు సంబంధించినది.
పేజీలు : 32