మీ ఫలితాలు మీకు నచ్చకపోతే,

మీ పద్ధతి మార్చుకోండి

''ప్రస్తుతం మనకి రెండు విషయాలు చాలా అవసరం. మొదటిది పేదల జీవన పరిస్థితులను గురించి సంపన్నులు తెలుసు కోవడం, రెండవది సంపన్నులు ఎట్లా కార్యసాధన చేస్తారో పేదలు తెలుసుకోవడం.'' - జాన్‌ ఫోస్టర్‌

జీవితంలో అభివృద్ధి సాధించాలంటే మనం ముందే ఏర్పరిచి వుంచుకున్న అభిప్రాయాలనుంచీ బయటపడాలి. బయటపడి సంపద అభివృద్ధికి ప్రత్యామ్నాయాలను వెతకాలి.

ఉద్యోగపథంలోనే వుండడానికి ఇష్టపడే 95 శాతం మంది తాము బయలుదేరిన చోటనే తేలతారనేది నిజం.

మనం ఇందుకు భిన్నంగా వుండాలని నిజంగా అనుకుంటే సంపద సాధించిన ఆ 5 శాతంలో వుండాలనుకుంటే, మనం సంపద సృష్టించే ద్వారాలలోగుండా ప్రయాణించాలి.

రాబోయే అధ్యాయంలో నేను మరింత లోతుగా ఆదాయం పొందడానికీ సంపద సమకూర్చుకోడానికీ కల తేడాను చర్చిస్తాను. అంతే కాదు చరిత్రలో ముందెన్నడూ లేని విధంగా ఇప్పుడు సంపద సాధిండం సులువనేది కూడా తెలియజేస్తాను....

పేజీలు : 100

Write a review

Note: HTML is not translated!
Bad           Good