నాగరికత పెరగటంతో మానవుడు సంఘం, సమాజం, సమూహాలుగా జీవిస్తూ ఒకరి తో ఒకరు సంబంధ భాందవ్యాలు నేర్చుటకు, సంమజంలో తన అవసరాలను తీర్చుకొనుటకు, సంబంధాలను పెంచుకొనుటకు భావ ప్రసారం ఏంతో ప్రధానమైనది.
మనిషి నాగరికత తెలియనప్పటి నుండి బాష పుట్టని కాలం నుండే తన చేష్టల ద్వారా భావాన్ని తెలియపరచడానికి ప్రయత్నంచేవాడు. బాష పుట్టిన తర్వాత భావ ప్రసరణ సరళీక్రుతమైంది. నేడు వస్తు మార్పిడి నుండి కరెన్సీ మార్పిడి లోకి వచ్చినా భావ వ్యక్తీకరణకు అత్యంత ప్రాధాన్యం ఏర్పడినవి. కమ్యూనికేషన్ వ్యవస్థ పెరగడం ఇండస్త్రీ , ఫైనాన్స్ , ఐ.టి రంగం మార్కెటింగ్ రంగాల పెరగడంలో కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం బాగా పెరిగింది. భావ వ్యక్తీకరణ విధానం వలన వ్యక్తి అత్యన్నత స్థానానికి చేరుకుంటాడు. నేటి విద్య వ్యవస్థ లో కమ్యూనికేషన్ స్కిల్స్ కు పెద్ద పీట వేశారు. సమాజంలో ఎలా ప్రవర్తించాలి ? కొలీగ్స్ తో ఎలా మసులు  కోవాలి ? ఒక విషయం పై అనర్గళంగా మాట్లాడుతూ అందరికి తన అభిప్రాయం వ్యక్తీకరించి ఆకట్టు కోవడం ఎలా ? ఇంటర్వ్యూ కి ఏలా అటెండ్ కావాలి ? స్టేజి ఫియర్ ఎలా పోగొట్టు కోవాలి ? నలుగురి తో మాట్లాడే తీరు వ్యవహరించే పద్దతులు ఎలా వుంటాయి. ? అనేది ఏంటో మంది కి తెలియడం లేదు. నేటి విద్యార్ధులకు వాటిపై అవగాహన కల్పించే విధంగా ఈ పుస్తకం ఉపయోగ పడేలా వ్రాయడం జరిగింది. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good