ఈ పుస్తకం రాయడానికి ప్రేరణ వివిధ ఐ.టి.ఐ.లలో చదివే చాలా మంది విద్యార్థులు. సాధారణంగా ఐ.టి.ఐ.లో ఎలక్ట్రీషియన్‌ లేదా వైర్‌మెన్‌ కోర్స్‌లలో జాయిన్‌ అయ్యే విద్యార్థులందరూ టెంత్‌ మాత్రం పాస్‌ అయివుంటారు. ఆ పదవ తరగతి పరిజ్ఞానం వీరికి ఇంగ్లీష్‌ ధారాళంగా చదివి అర్థం చేసుకునేంత శక్తిని కలిగించలేదు.

అందువల్ల ఈ ఎలక్ట్రికల్‌ యింజనీరింగ్‌కి చెందిన పుస్తకాలు స్వయంగా చదివి అందులోని సారాంశాన్ని గ్రహించగలగడం వీరికి అసాధ్యమయిన పని కాకపోయినా కాస్త కష్టంతో కూడుకున్నదే! ఐ.టి.ఐ.లలో ఇన్‌స్ట్రక్టర్స్‌ కూడా చాలా వరకూ ఇంగ్లీషులో బోధించడం, లేదంటే నోట్స్‌ ఇంగ్లీషులో మాత్రమే యివ్వడం వల్ల... వీరు దాన్ని కంఠస్థం చేసి పరీక్షలలో మంచి మార్కులు సాధించుకో గలుగుతున్నారు తప్ప...

నిజంగా ఆ యింజనీరింగ్‌ అంశాలను తమ మెదడుకి ఎక్కించుకోలేకపోతున్నారు. ఐ.టి.ఐ. పాస్‌ అయిన తరువాత పరిశ్రమలలో ఉద్యోగం సంపాదించినప్పుడు వీరికి అసలు సమస్య మొదలవుతుంది.

నేర్చుకున్నది సగం సగం. అయితే యిండస్ట్రీలో అర్థం అయి అమలు చేయగలిగేది కూడా సగం సగమే... రెండు సంవత్సరాలుగా చదివి వచ్చినా... చదివిందికేవలం ధియరీ, అందులోనూ అర్థంకాని భాషలో వున్నది కావడంతో..

వీరు తమ కళ్ళముందు కనబడే ఎలక్ట్రికల్‌ పరికరాలు, అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌, పవర్‌ ఎలక్ట్రానిక్స్‌ వంటివి అర్థం చేసుకోలేక అవస్థపడుతుంటారు! అదిగో... అటువంటి విద్యార్థులకి ఉపయోగకరంగా వుండడానికి ఈ పుస్తకం...

పేజీలు : 320

Write a review

Note: HTML is not translated!
Bad           Good