కమ్యూనిస్టు పార్టీ ఎలా ఉండకూడదు? - రంగనాయకమ్మ

శ్రమ దోపిడీ సాగుతున్న సమాజాన్ని దోపిడీ లేని సమాజంగా మార్చుకోవలసిన బాధ్యత శ్రామిక వర్గానిదే. ఈ వర్గం రాజ్యాధికారాన్ని సాధించే దశకన్నా, తర్వాత సమాజాన్ని మార్చుకునే దశలే అత్యంత కష్టమైనవి.
అమలులో ఉన్న ఈ సమాజం ఎందుకు మారాలి? ఇందులో ఉన్న తప్పులు ఏమిటి? ఈ సమాజం ఎందుకు వద్దు? ఇది మారాలంటే ఎలా మారాలి? ఎక్కడిదాకా మారాలి? ఎక్కడ ఆగాలి? - శ్రామిక ప్రజలకు ఇదంతా ఎప్పుడో తెలియడం కాదు - ఇప్పుడే తెలిసి ఉండాలి.

శ్రమ దోపిడీ మీద పోరాటం వ్యక్తులుగా, ఒంటరిగా చేసేది కాదు, సమిష్టిగా, శ్రామిక సంఘాల శిక్షణతోచేసేది.
కమ్యూనిజం కోసం, కమ్యూనిస్టు సంఘం (పార్టీ) అత్యవసరం. సంఘం లేకుండా సమిష్టి పోరాటం అసాధ్యం. సంఘ జీవితంలో నిబంధనలూ, కర్తవ్యాలూ, ఆదర్శాలూ పెనవేసుకుని ఉంటాయి. సంఘజీవితం, వ్యక్తుల్ని పాత తప్పుడు భావాల నుంచి విముక్తి చేస్తుంది. పరిశుభ్రం చేస్తుంది.
శ్రామిక ప్రజలు, శ్రామికసంఘాల ద్వారానే, తమని తాము అభివృద్ధి పరచుకుంటూ, సమాజాన్ని విప్లవ మార్గం వేపు తిప్పాలి.
కమ్యూనిస్టు సంఘం ఎలా ఉండాలో తెలుసుకోవడం, అది ఎలా ఉండకూడదో తెలుసుకోవడం కూడా!

Write a review

Note: HTML is not translated!
Bad           Good