'ప్రపంచాన్ని గురించి ఎంతమంది తత్వవేత్తలు ఎన్ని భాష్యాలు చెప్పినా, దాన్ని సమూలంగా మార్చాలని చెప్పినవారు మార్క్స్ - ఏంగెల్స్‌లు. ఆనాటి కమ్యూనిస్టు లీగ్ ఆదేశాలతో వారు సమర్పించిన ఈ పత్రం వెలుగులోనే 1871లో పారిస్ కమ్యూన్, 1917లో అక్టోబర్ విప్లవం విజయవంతమయ్యాయి. ఆ తర్వాత తూర్పు యూరప్ దేశాల్లో, చైనాలో, వియత్నాం, లావోస్, కాంబోడియా, క్యూబాలలో కూడా విప్లవాలు విజయవంతమయ్యాయి.
అయితే ఈ మహా విజయాలతోపాటు సోషలిజం కొన్ని అపజయాల్ని కూడా చవిచూసింది. 1990 ప్రాంతాలలో సోవియట్ యూనియన్‌తో సహా అనేక దేశాల్లో సోషలిస్టు వ్యవస్థలు కుప్పకూలాయి. చైనా కూడా ఆ బాటలోనే సాగుతోంది.
మనదేశంతో సహా అనేక దేశాల్లో సామ్రాజ్యవాదుల ప్రత్యక్ష వలస స్థానంలో ప్రత్యక్షంగా పరోక్షంగా వారితో మిలాఖత్ అవుతున్న సంపన్న వర్గాలు అధికారం చెలాయిస్తున్నాయి. మరోవైపు కమ్యూనిస్టులు, ఇతర ప్రగతిశీల శక్తులు అనేక కారణాల వలన బలహీనంగా ఉన్నాయి. ప్రపంచ విప్లవశక్తులకు తమ తమ అనుభవాల్ని పంచుకొనే కేంద్రమేలేని స్థితి ఏర్పడింది.
Pages : 80