2004 ఎన్నికల తరువాత రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సూచనలు చేయాల్సిందిగా కమిషన్లను వేసాయి. డా॥ఎం.ఎస్.స్వామినాథన్, ప్రొ॥జయతిఘోష్, జస్టిస్ రాంచెన్నారెడ్డి కమిషన్లు ఏర్పడినాయి. ఆ కమిషన్లు నిర్ణీత కాలానికి ముందే తమ నివేదికలను ఇచ్చాయి. ఆ నివేదికలను పరిశీలించడానికి మంత్రులతో కేంద్రం, రాష్ట్ర స్థాయిలో  ఉపసంఘాలు  వేశారు, ఆ ఉపసంఘాలు, నివేదికలను ఆమోదిస్తూ అమలు చేపట్టాల్సింగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరాయి. పార్లమెంటు మరియు శాసనసభల్లో నివేదికలను అమలు జరపబోతున్నట్టు ప్రభుత్వాలు  ప్రకటించాయి. కానీ, ఆచరణలో ఆ నివేదికలు  కాగితాలకే పరిమితమయినాయి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good