ఈ నాటికలకు పునాది సమకాలీనత, సామాజికత, దేశీయత, వాస్తవికత.!! చిన్న చిన్న నాటికలతో కూడిన ఈ సంపుటిలోని మొదటి నాటిక 'గ్రామకచ్చేరి' తన కాలం నాటి గ్రామీణ సామాజికత యితివృత్తంగా దేశీయతా ముద్రతో వాస్తవిక జవిత సమస్య కేంద్రంగా నడుస్తుంది. ఒక గ్రామంలో కరణం, మునసబులు రైతుల నుండి శిస్తులు వసూలు చేయటం, శిస్తులు చెల్లించనివారిని శిక్షించటం ఇందులోని యితివృత్తం. ఇంకా ఈ నాఇకలలో రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌ అక్రమాలు, పోలీసు వ్యవస్ధ దుర్మార్గాలు, న్యాయవ్యవస్ధలోని అన్యాయాలు, పన్నుల పేరిట మునిసిపాలిటీల దోపిడీ, లంచగొండి వ్యవస్థ, మద్యపానంపై నిరసన, మూఢాచారాలపై దాడి యిలా పలు అంశాలు చోటు చేసుకున్నాయి. సామాజిక రుగ్మతలపై ధ్వజమెత్తటం, హేతుబద్ధమైన ఆలోచనలను ఆహ్వానించటం కనిపిస్తుంది. రచయిత సర్వారాయుడు ఆనాడు తనకున్న పరిమితులలోనే ఒక సంక్షేమ సమాజాన్ని ఆకాంక్షించి ఈ నాటికలను రచించారనేది స్పష్టమవుతుంది.

గిడుగువారి వ్యవహారిక భాషోద్యమాన్ని, గురజాడవారు ప్రతిపాదించిన ఆధునిక భావాలను స్వీకరించి శృంగారకవి సర్వారాయుడు గారు ఈ నాటికలలో ప్రతిభావంతంగా చిత్రించారు.

ఈ తరం రచయితలు ఈ పుస్తకాల్ని చదవాలి. ఈ పుస్తకం చదివితే మన ఆలోచనా పరిధులను విస్తృత పరిచిన తొలి తెలుగు నాటికా పరిణామం, వికాసం తెలుస్తుంది. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good