చాలా బాగున్నాయ్‌ జ్ఞాపకాలు

'ఇట్లు శ్రావణీ సుబ్రమణ్యం', 'ఇడియట్‌', 'పోకిరి' సిన్మాల నిర్మాణం వెనుక కథల్ని చదివితే ఆ సిన్మాలకి పులగం చిన్నారాయణ పి.ఆర్‌.ఓ.గా చేశాడు గాబట్టి, ఆ షూటింగ్‌లప్పుడు వెళ్ళి అబ్జర్వ్‌చేసి, జరిగినవి చనువున్న యూనిట్లో జనాన్నీ వాళ్ళను కనుక్కుని రాసుంటాడు అనుకోవచ్చు.

కానీ, అతనికి సంబంధం లేని 'అరుంధతి', 'దశావతారం', 'ఏ మాయచేశావ్‌' లాంటి సినిమాల గురించి కూడా ఇంకా బాగా రాసిన విధం చూసి ఆశ్చర్యపోయిన నేను అతని ఆర్టికల్‌ కోసం వారం వారం 'సాక్షి' ఫన్‌డే బుక్‌ కోసం ఎదురు చూసేవాణ్ణి. ఎన్నో జ్ఞాపకాల్ని, ఎన్నో అనుభూతుల్ని తను అనుభవించినట్టు రాశాడు.

ఒక్కో వ్యాసం చదువుతుంటే నాకు కలిగిన ఉత్సాహం అంతా ఇంతా కాదు.

ఇళయరాజాగారితో మూడువారాలు పనుండి మద్రాసు వెళ్ళినప్పుడు అంతవరకూ వచ్చిన ఆర్టికల్స్‌ తాలూకు ప్రింటౌట్స్‌ అతన్నడిగి తీసుకువెళ్ళి ఖాళీగా ఉన్నప్పుడు చదువుతుంటే సిన్మాని ఇలాంటిలాంటి గమ్మత్తుల్తో ఇంకా బాగా తియ్యాలి అనిపించేది. వివరంగా చెప్పలేని విచిత్రమైన ఉత్సాహం జనరేటయ్యేది.

కాస్త ఎక్స్‌పీరియన్స్‌ ఉన్న నాకే ఇలాంటి తన్మయానందం కలుగుతుంటే, ఇంక కొత్తగా వస్తున్న యువదర్శకులు చదివితే వాళ్ళెంత ఇన్‌స్పైరైపోతారు? అనిపించేది చాలాసార్లు.

ఈ పుస్తకం మా తరం వాళ్ళనే కాదు, ఈ తరం వాళ్ళనే కాదు, ఏ తరం వాళ్ళకైనా చాలా ఉత్సాహాన్నీ, ఉపయోగాన్ని కలుగజేస్తుందని కొండంత నమ్మకం నాకు. - వంశీ

పేజీలు : 256

Write a review

Note: HTML is not translated!
Bad           Good