మనిషి
మానవ సంబంధాలు, లేదా కుటుంబ సంబంధాలు ఆర్ధిక పరిస్ధితిపై ఆధారపడి వుండటం అమానవీయమే. మానవీయంగా వుండటం సాధ్యం కానప్పుడు, మనిషి అమానుష చర్యకైనా సిద్ధ పడతాడు. అయితే అందుకు మనిషితనమే మనిషికి అడ్డుగా నిలుస్తుంది. అప్పుడు తనతో తాను పోరాడవలసి వస్తుంది. అందులో గెల్చినా, ఓడినా గుండెల్లో 'ముల్లు' గుచ్చుకోక తప్పదు. అది తప్పించుకోలేని విషాదం.

నాలుగు చినుకులు రాలని ఆకాశం నుంచీ డబ్బులు రాల్తాయా? అట్లా జరగదని రాంరెడ్డికి తెలీదా? తెలుసు కానీ, అట్లా జరిగితే తప్ప ''ఇంకే రకంగా వచ్చినా డబ్బును మోసే శక్తి తనకు లేదు''. అది రాంరెడ్డి పరిస్థితి. రాయలసీమలోని వేలాది, లక్షలాది రాంరెడ్ల పరిస్థితి అదీ. ఈ కథ రాసినందుకు నేను విశ్వప్రసాద్‌ను అభినందిస్తున్నాను. అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఒక్క మెతుకును పట్టి చూస్తే చాలు. కథా రచయితగా విశ్వప్రసాద్‌ విశేషానుభవం లేని చిన్నవాడే అయినా, సహజంగా ప్రారంభ దశలో వుండే కొన్ని ఔత్సాహిక సరదాలను ఎక్కడా ప్రనదర్శించకుండా, అనుభవజ్ఞుడైన కథకుడి మాదిరిగా నిబ్బరంగా కథను మాత్రమే చెప్పడం విశేషమనే చెప్పాలి. ఏదో గొప్ప సత్యం, ఇంతకు ముందెవ్వరూ చెప్పలేనిది చెబుతున్నానన్న ఆడంబరం కూడా ఎక్కడా చూపలేదు. - పి.రామకృష్ణారెడ్డి

Write a review

Note: HTML is not translated!
Bad           Good