శిరంశెట్టి కాంతారావు రాసిన పద్దెనిమిది కథల సంపుటం 'చొరబాటు'. మన ప్రాంతానికి చెందిన జీవితాన్నే, మనకు తెలియని, తెలిసినా పట్టించుకోని, ఎన్నో వైనాల్ని కాంతారావు మన ముందుకు తీసుకొచ్చారు. ఈ కథలన్నింటిలోనూ జీవితం ఎలా నడుస్తున్నదో దాఖలా ఉంది. ఎలా నడవకూడదో ఆ ఫిర్యాదూ ఉంది. ఎలా నడిస్తే బావుంటుందో ఆ ఆకాంక్ష ఉంఇ. ఇంక జీవితం తాను అనుకంటున్నట్టు నడవడం లేదు కాబట్టి ఒక్కొక్కసారి కథకుడు ఉండబట్టలేక, ఊరుకోలేక సాహసంతోనో, సమయోచితంగానో ఇచ్చేసిన తీర్పు ఉంది. తెగించి చెప్పకుండా ఉండలేని ముగింపు ఉంది.

ఈ కథలు చదవగానే నాకు స్పురించింది, ఇందులోని విస్మృతి. అమెరికాలో రిటైరైన ఉద్యోగి నుంచి, గంగ ఒడ్డున దశాశ్వమేథ్‌ ఘాట్‌లో పడవనడిపే సలీం కాకా మొదలుకొని ఏనాటివాడో ముక్త్యాల రాజాని పెళ్ళివిందుకు ఆహ్వానించిన సోమ్లానాయకుడి దాకా ఎందరో మనుషులు. రాజస్థాన్‌ లోహకారుల నుండి, నెక్కొండ కాటికాపరుల దాకా ఎన్నో వృత్తులు. భర్పూర్‌ థర్మల్‌ స్టేషన్‌ మదలుకుని పాపికొండల్లో ఆశ్రమ పాఠశాల దాకా ఎన్నో సంస్థలు, ప్రతి కొత్త సంస్థచుట్టూ పిగిలిపోతున్న పాతజీఇతం, కొత్త వేదన.

ఈ కథలు మనచుట్టూ సంఘవిస్తున్నవే.

కొన్ని కథల్లో స్టేషన్ని సమీపించే రైలులాగా కథకుడు ఒక్కసారి కూతపెట్టడం కనిపిస్తుంది. 'ఎంచి చూడగ రెండె కులములు' కథలో ముగింపు అట్లాంటిది. 'అభిజాత్యం' కథలో ముగింపు మరీ తీవ్రంగా కనిపిస్తుంది. 'తెరవెనుక' కథలో జీవితం అలానే ఉంటోందన్నమాట ఎంత నిజమో ఆ ముగింపు కూడా అలానే ఉంటుందనే మనకి మన వార్తాపత్రికలు సాక్ష్యమిస్తున్నాయి.

ఇక అన్నిటికన్నా నివ్వెరపరిచే కథ 'మా ఊరు అమ్ముతం కొనుక్కోండ్రీ' అన్నది. కథకుడు వాస్తవాన్ని చిత్రిస్తాడంటే అర్థం కేవలం దృశ్యవాస్తవాన్ని చిత్రిస్తాడనే కాదు. ఆ దృశ్యం వెనుక ఉండే అదృశ్యాన్ని కూడా చిత్రిస్తాడని. మన చుట్టూ పనిచేస్తున్న దృశ్య అదృశ్య శక్తుల్ని నిదానించడంలో ఇంత శక్తివంతమైన కథని నేనీమధ్య కాలంలో చదవలేదు. - వాడ్రేవు చినవీరభద్రుడు

Write a review

Note: HTML is not translated!
Bad           Good