పిల్లల ప్రపంచం వేరు. వారి ప్రాథమ్యాలు వేరు. వారి ఉత్సుకతలు వారి అలవాట్లూ వేరు. వారి భాష కూడా వేరు. అది సరళ సుందరంగా ఉండాలి.
పిల్లల మనస్సులను అమితంగా ఆకర్షించేది అద్భుత రసం. అద్భుత కథలంటే చెవి కోసుకుంటారు. నవ రసాల్లోనూ వీర, కరుణ, హాస్య రసాలు కూడా వారిని ఆకర్షిస్తాయి.
పిల్లలకి జంతువులూ, పక్షులూ పాత్రలుగా చేసుకుని రాసే కథలంటే చాలా ఇష్టం. ఆ కథల్లో అవి మనుషుల్లాగా మాట్లాడుతాయి. అద్భుతాలు చేస్తాయి. సంబ్రమాశ్చర్యాలలో ముంచెత్తుతాయి.
పిల్లల ఆకాంక్షలకి అనుగుణంగా ఈ పుస్తకంలో కథలన్నీ ఉంటాయి. చిన్నారి చిట్టెలుక చేసే సాహసాలూ, చిట్టెలుక చిలిపి కోరికలూ, తెలివిగా కష్టాలు ఎదుర్కొనే బకరాజులూ ఉంటారు. చిన్న చుక్కల అమాయకత్వమూ, మాయా దర్పణాలూ కనబడతాయి. ఈ కథలు పిల్లల ఊహాశక్తికి పదును పెడతాయి. మంచి చెడుల తారతమ్యాన్ని తెలుసుకునే చేస్తాయి. జీవన నైపుణ్యాలు అలవడేలా చేస్తాయి. సాహిత్యం పట్ల అనురక్తిని కలిగిస్తాయి.
పేజీలు : 56