బాల సాహిత్యంలో విశేషంగా కృషిచేసిన వీరు, కరీంనగరము జిల్లా చౌలమద్ది గ్రామంలో శ్రీమతి లక్ష్మమ్మ, వేంకటయ్య దంపతులకు, 26 జనవరి 1942న జన్మించారు.

వీరు మొత్తం 36 పుస్తకాలను ప్రచురించారు. ఇందులో 26 పుస్తకాలకి పైగా బాలసాహిత్య రచనలే వెలువరించారు. 36 ముద్రిత పుస్తకాలతో పాటు పలు బాలల పత్రికలు బుజ్జాయి, బొమ్మరిల్లు, చందమామ, బాలమిత్ర, బాలభారతం, బాలబాట తదితర బాల మాసపత్రికలు మరియు సంకలనాలలో కథలు, బాలల కథలు, పొడుపు కథలు, కవితలు, గేయాలు, గ్రంథ సమీక్షలు, వ్యాసాలు, అనువాదాలు తదితరాలు ప్రచురితమయ్యాయి.

ఆకాశవాణి హైదరాబాద్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, వరంగల్లు కేంద్రాల నుండి కవితలు కదంబ కార్యక్రమాలు ప్రసారమయ్యాయి.

బాల సాహిత్యంలో వీరు చేసిన అవిరళ కృషికి, 2017 సంవత్సరానికిగాను కేంద్ర సాహిత్య అకాడమీ వారి అవార్డు, 'బాల సాహిత్య పురస్కార్‌ - 2017' వరించింది. 

పేజీలు : 59

Write a review

Note: HTML is not translated!
Bad           Good