కథ, అంటే ఓ పదో పదిహేనో పేజీల సరిపడా వాక్యాలు. పదాలే; అయితే ఆ పదాలు, వాక్యాలు, శక్తివంతమైన ఇమేజెస్ గా, ఫీలింగ్స్, భావనలుగా, ఒక ఎరుకలా మారిపోతాయి. కథలోని పదాలు, వాక్యాలు అన్ని కలిసి, ఒక సంక్లిష్టమైన జీవితాన్ని లేదా జీవితం లాంటి జీవితాన్ని మనకు చూపుతాయి. ఏ కాలానికా కాలం, ఆ సమాజపు కలలన్ని నిక్షిప్తం చేయబడతాయి. ఈ కథల్లో ఆ కాలపు ఉద్వేగాలు, చిధ్రమోతున్న ఆత్మల గానాలు, మొలకెత్తుతున్న కలలు, ఈ కథల్లో రికార్డు చేయబడ్డాయి.
నా కథలు, నా లోపలి నిశ్శబ్దాలు, సంచలనాలు నిలువనియని ఉద్వేగాలూ, అవన్నీ వందలాది పదాలుగా, వాక్యాలుగా, ఒకానొక కథాభాషగా, నేరేటివ్ గా మారి, నేను నడిచి వచ్చిన కాలాన్ని దాని నడకల్ని, మనుషుల్ని, మనుషుల కలల్ని, గాథల్ని, వాళ్ల గాయాల్ని రికార్డు చేసాయి. మరియు నేను నడిచి వచ్చిన కాలంలాగే, నా కథల్లోఒక వాస్తవిక రూపం ఉంది.
ఇందులో
. చిట్టచివరి రేడియో నాటకం.
. జీవని.
. పార్వతి కల.
. క్రానికల్స్ ఆఫ్ లవ్.
. నీటి పిట్టల కథలు.
. నిప్పు పిట్ట, ఎర్ర కుందేలు మరియు అదృశ్యమవుతున్న జాతుల కథలు......... మొత్తం పదిహేను ఆసక్తికరమైన అతిపెద్ద కథల సమాహారమే ఈ "చిట్టచివరి రేడియో నాటకం". -డా. వి. చంద్రశేఖరరావు

Write a review

Note: HTML is not translated!
Bad           Good