ఆధునిక హిందీ నవలా సాహిత్యంలో దేదీప్యమానంగా వెలిగి లక్షల కాపీలు ముద్రించిన ఘనత ఈ 'చిత్రలేఖ' నవలకు దక్కింది. భారతీయ సంప్రదాయంలో అతి ప్రాధాన్యమైన పాప పుణ్యాలు, ప్రేమ, కామం మధ్య ఉన్న సహజ స్వభావాలను మధిస్తూ విశ్లేషించే నవలామాలిక ఇది. స్త్రీ పురుషుల మధ్య ఉండే సంబంధాల వైవిధ్యాన్ని అతి నైపుణ్యంతో వివరిస్తూ సాగిపోయిన మధుర కళిక ఇది.
- ఆచార్య ఆదేశ్వర్రావు
* * *
ఈ నవల పాపపుణ్యాల ప్రశ్నలకు సమాధానము వివరిస్తుంది. పాపము అంటే ఏమిటి? దాని నివాసమెక్కడో తెలుసుకోవాలంటే భోగి బీజగుప్తుడు యోగి కుమార గిరులకు ఒక సంవత్సరం సేవ చేయమని ప్రశ్నలడిగిన శిష్యులు శ్వేతాంబరుడు, విశాలదేవ్‌లకు సలహా ఇస్తాడు గురువు రత్నాంబరుడు. సంవత్సరానికి తిరిగి వచ్చిన శిష్యుల అభిప్రాయాలను ఖండిస్తూ పాపానికి పుణ్యానికి గురువు ఇచ్చిన నిర్వచనం ఇది. “ఈ సృష్టిలో పాపమనేది పుణ్యమనేది ఏమీ లేదు. మనిషి విషమతలపట్ల అతని దృష్టికోణానికి పాపమని పుణ్యమని పేర్లు పెట్టారు. మానవుడు తన జన్మలో ఏది చేయాలో విధి నిర్ణయప్రకారం జరుగుతుంది.” అని తన అభిప్రాయాన్ని వివరించాడు గురువు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good