పూర్వం రేడియోలో పిల్లల కోసం 'బాలానందం' కార్యక్రమం వుండేది. ఇప్పుడు అనేక తెలుగు టీవి ఛానళ్లున్నాయి, ఏ ఒక్క ఛానలైనా బాలసాహిత్యం ఊసెత్తుతుందా? కొన్ని ఛానళ్లు బాలలకి పాటల పోటీలు నిర్వహిస్తున్నాయి. వాటిల్లో అన్నీ సినిమా పాటలే పాడతారు, బూతుపాటలకక్కడ నిషేధం లేదు.

మాతృభాష నిరంతరాయంగా మనుగడ సాగిస్తేనే బాలసాహిత్యం కూడా విలసిల్లుతుంది. తెలుగులో మాట్లాడటమే నామోషీ అనుకునే జనంలో మాతృభాష పట్ల చైతన్యాన్ని పెంచేందుకు కృషి జరగాలి. ఏవో కొన్ని ప్రభుత్వ సంస్థలు తెలుగు భాషను ఉద్ధరిస్తాయని అనుకోవటం అత్యాశే!

ఇలాంటి విషమ పరిస్ఠితుల్లో 'చింతాదీక్షితులు' మనకు స్ఫూర్థి కావాలి. తెలుగులో వున్న తరతరాల బాలసాహిత్యాన్ని శోధించి, సాధించి తెలుగు సాహిత్యానికి వెలుగులద్దిన వారు చింతాదీక్షితులుగారు. ఆయన ఒక్కరే ఆనాడు ఆ మహత్తర కార్యానికి, పూనుకుని మరుగున పడిన లేదా మేధోచౌర్యానికి గురౌతున్న బాలసాహిత్యాన్ని తల్లిబిడ్డలకందించిన వారు చింతాదీక్షితులు గారు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good