దేవతల కథలన్నీ జనాలకు తరతరాలుగా నిజంగా తెలిసిందీ అంటే...
డెక్కలి - చిందు - బైండ్ల - మాస్టీల నుండే...
వాళ్ళ కళారూపాల నుండే...
ఇంకా ఇలాంటివే... అతికొన్ని యక్షగాన కళారూపాల నుండే తప్ప
సరాసరిగా పురాణాల సంస్కృత గ్రంథాల నుండో... పండితుల నుండో కాదు
'ప్రేక్షకుడు' అనే ఈనాటి బంగారు బాతును కనిందికూడా ఈ కళారూపాలే.
నిరసన కోసమే పుట్టిన ఈ కళారూపాల నుండే..
నాటకం, సినిమా లాంటి ఎన్నో విత్తురూపాలు పుట్టినవి.
అట్లా పుట్టిన టిక్కెట్టేలేని ప్రేక్షకున&ఇన కోట్ల కలెక్షన్స్ కోసం
వెకిలి వినోదం దారి పట్టించి, డాలర్లు - రూపాయల కోసం బిగబట్టింది పెట్టుబడి.
అట్లాంటి విత్తు రూపాలన్నీ... పైసలకు కరిగినై... మరిగినై...
దీనికి ఎదురు నిలిచినవే..'బరి' తెగించిన కళారూపాలు... డెక్కలి - చిందు - మాష్టి - బైండ్ల అనేవే.
అవ్వి గుడిసెల్లో - జనం గుండెల్లో బతికినై -
ఆకలితో.. ఈ పొద్దు సస్తున్నవి...
అయినా... అస్తిత్వాన్ని నిలుపుకుంటున్నాయి.