భారత చైనాల గొప్ప నాగరికతలను బౌద్ధధర్మం వేయి సంవత్సరాలకు పైగా సన్నిహితంగా కలిపి ఉంచింది. రాజకీయ, ఆర్థిక విషయాలతో సంబంధం లేకుండా కేవలం ధర్మం మీదే ఆధారపడిన ఇటువంటి అనుబంధం మానవసంబంధాల చరిత్రలో మరెక్కడా కానరాదు. రెండు దేశాలకు చెందిన పండితభిక్షువులు సంపుటాలకొద్దీ పవిత్రగ్రంథాలను చైనాకు తీసుకొనిపోయి సంస్కృతం నుండి చైనాభాషలోనికి అనువదించడం కూడా అభూతపూర్వవిషయమే.

ఫాహియాన్‌ రంగం మీదకు వచ్చేంతవరకు మధ్యఆసియా నుండి తెచ్చుకొన్న గ్రంథాల నుండి చైనాలో చేయబడిన అనువాదాలు దోషాలతో, వైరుధ్యాలతో నిండి ఉండేవి. ఎందుకంటే ఆరంభంలో ఈ పండితులెవరికీ భారతదేశంతో ఎటువంటి సంబంధం ఉండేది కాదు. భారతదేశంలోని అన్ని పవిత్రక్షేత్రాలను దర్శించి పెద్దమొత్తంలో ధార్మికగ్రంథాలను, సంబంధించినవాటిని సంగ్రహించినవారిలో ఫాహియాన్‌ మొదటివాడు.

Pages : 86

Write a review

Note: HTML is not translated!
Bad           Good