చైనాలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏంచేశారు? ఓ పాఠకుడి ప్రశ్నకు శ్రీశ్రీ జవాబు : 'ముందు దోమల్ని, ఈగల్ని, నల్లుల్ని, దేముణ్ణి నాశనం చేశారు. అందువల్లనే చైనా అంత ఆరోగ్యంగా ఉంటుంది. మనదేశంలో ఇవన్నీ పుష్కలంగా ఉన్నాయి. ఎక్కడ ఏ మూలకి పోయినా మీకు కనిపించేవి మురికివాడలూ, దేవుడి గుళ్ళూను. వాటిలో కనిపించేవి దరిద్రమూ, దైవభక్తి. ఏ దేవాలయం దగ్గర చూసినా దరిద్రులు అధిక సంఖ్యలో మూగి ఉంటారు. దైవభక్తి, దరిద్రం సహవాసం చేస్తాయనడానికిది నిదర్శనం. వీటిలో ఏ ఒక్కటి పోయినా రెండవది కూడా అంతరించిపోతుంది. అప్పుడే దేశం బాగుపడుతుంది.

పేజీలు : 80

Write a review

Note: HTML is not translated!
Bad           Good