తెలంగాణా జనజీవనం, నిజాంపాలన నాటి తదనంతర రైతాంగ పోరాటం, నాటి సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక అంశాల నేపథ్యంలో దాశరథి రంగాచార్య రూపు కట్టించినట్లు మరే రచయితా చిత్రించలేదన్నది సత్యం. చారిత్రకంగా జరిగిన సామాజిక పరిణామదశల్లో జనశ్రేణులు ఎలా స్పందించిందీ, తమ సాంస్కృతిక స్వేచ్ఛ కోసం ఎలా నిరసన తెల్పిందీ, రాజకీయ అస్తిత్వం కోసం ఎలా ఆందోళన, తిరుగుబాటు, ప్రతిఘటనలు చేసిందీ - చివరకు భూమికోసం, భక్తుకోసం, భాషకోసం, వెట్టిచాకిరి అంతం కోసం, నిజాం పాలనను తుదముట్టించటం కోసం ఎలా సంఘటించి పోరాడిందీ 'దాశరథి రంగాచార్య రచనలు' నేటి తరానికి కళ్ళముందు కదలాడేలా చేస్తాయి.

చిల్లరదేవుళ్ళు, మాయజలతారు, మోదుగుపూలు, జనపదం వంటి నవలలు - 'చరిత్ర నిర్మాతలు జనం' అన్న సత్యాన్ని వెల్లడిస్తాయి. జనం భాషలో గుండెలను పలకరిస్తూ, మెదళ్ళకు పదనుబెడ్తాయి.

పోలీసు చర్యకు పూర్వము తెలంగాణా ప్రాంతములో చిల్లర దేవుళ్ళు అధికార రూపములో వెలసినారు. ఈ అధికారుల సుఖసంతోషాలకు, భోగసంతోషాలకు, భోగవిలాసాలకు ఉపకరించుట మాత్రమే నిరుపేదల బ్రతుకు ఫలము. ఈ పతనము కేవలము ఒక్క రాజకీయ జీవితమునందేకాక సాంఘిక, ఆర్థిక, నైతిక జీవితములందు కూడా ప్రవేశించినది. ఒకవంక ప్రచండ మారుతమువలె నిరంకుశ ప్రభుత్వముతో పాటు మతవిద్వేష శక్తులు విజృంభించి పల్లె పల్లె, మూల మూల వ్యాపించి, తెలుగుజాతి స్వరూపమును రూపుమాపు స్థితిలో నుండగా ఆనాటి పాలకుల కనుసన్నల నర్తించిన అధికారులైన తెలుగువారి స్వార్థము పూర్తిగా మానవత్వమును మరిపించు స్థితికి దిగజారినది. ఇట్టి దీనస్థితిని మన కన్నులకు కట్టినట్లు 'చిల్లర దేవుళ్ళు' అను ఈ నవలలో శ్రీ దాశరధి రంగాచార్యులవారు చత్రీకరించారు.

Pages : 173

Write a review

Note: HTML is not translated!
Bad           Good