ప్రజలు పత్రికలు చదవడం తప్పు. అందులోనూ ఇంగ్లీషు పత్రికలు చదవడం పెద్ద తప్పు. రఘు హైదరాబాదులో చదువు ముగించుకొని స్వగ్రామానికి తిరిగివస్తూ తనతో ఒక ఇంగ్లీషు పత్రిక తెచ్చుకొంటాడు. ఆ తప్పిదానికి పోలీసు అమీను చేత చెంప పెట్టు తింటాడు. రఘులో తిరుగుబాటు ప్రారంభమవుతుంది. ఉద్యమం మొదలవుతుంది. రఘు ఉద్యమానికి అతని మేనమామ వీరయ్య, వీరయ్య కూతురు జానకి, అదే గ్రామంలోని నాగేశ్‌ తోడ్పడుతారు. నాగేశ్‌కు హింసలో నమ్మకం. రఘు అహింసావాది. రఘు, జానకి ప్రేమించుకొంటారు. నాగేశ్‌, సావుకారు వెంకయ్య కూతురు రుక్మిణి ప్రేమించుకొంటారు. అధికారుల దౌర్జన్యాలు, ప్రజల అగచాట్లు చూచి రఘు తన సిద్ధాంతాలు మార్చుకొని హింసామార్గం తొక్కుతాడు. తాసిల్దార్‌ కొడుకు రషీద్‌ రజాకార్ల నాయకుడు. అతడు రుక్మిణిని మానభంగం చేస్తాడు. రుక్మిణి నూతిలో పడి మరణిస్తుంది.జానకి తనని మానభంగం చేయవచ్చిన రషీద్‌ను కత్తితో పొడిచి చంపుతుంది. దుండగులు జానకిని కాల్చి చంపుతారు. జనం తాసిల్దారుపై పగ తీర్చుకొంటారు.

ఈ బరువైన కథను మధ్య మధ్యన సంస్క ృతులకు చెందిన ఉప కథలతో సుందర గంభీరంగా, వ్యంగ్య మర్యాదతో చెప్పుకు వచ్చారు శ్రీ రంగాచార్యులు గారు. కోయల ఆచార వ్యవహారాలు, వారి నృత్యాలు, కథలు, మొహర్రం కథ నవలకు నిండుదనాన్ని, సహజత్వాన్ని చేకూర్చాయి.

రంగాచార్యులు గారు అందమైన భావాలను అందమైన భాషలో మనస్సులో హత్తుకొని పోయేటట్టు చెప్పగలరు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good