పిల్లలు, పెద్దలూ తప్పక చదివి ఆనందించాల్సిన కథలు! ఈ పుస్తకంలో 60 హాస్య, వివేక, చమత్కార కథలు బొమ్మలతో చక్కగా అందించారు రచయిత రాజేశ్వర రావు గారు. ప్రపంచ సాహిత్యంలో హాస్య రచనలు ఎన్నో వున్నా, మన తెలుగు సాహిత్యంలో హాస్య రచనను ఉన్నత శిఖరాలకు ఎక్కించినవాడు హాస్యకవి, వికటకవి, మన తెలుగు కవి - తెనాలి రామకృష్న కవి. అడుగడుగునా తన హాస్యంతో శ్రీకృష్ణదేవరాయలుకు అపరిమిత ఆనందాన్ని కలిగించిన ప్రతిభాశాలి తెనాలి రామకృష్ణ. మనకు తెలుగు సాహిత్యంలోనూ, అనేక పుస్తకాల ద్వారానూ లభించిన కథలనే పిల్లలకూ, పెద్దలకూ అర్థమయ్యేవిధంగా సులభ, సరళ భాషలో ''తెనాలి రామకృష్ణ - హాస్య, వివేక, చమ్కార కథలు''ను  అందించారు రచయిత పి.రాజేశ్వరరావు గారు. ఈ కథలు పాఠకులందరిలో హాస్యంతోపాటు వారి వివేకాన్ని, విజ్ఞానాని, జ్ఞాపక శక్తిని పెంచేందుకు, ఉల్లాసంగా వుండేందుకు ఉపకరిస్తాయనడంలో సందేహం లేదు. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good