అద్భుతమైన బొమ్మలున్న పిల్లల కథలంటే మీలాగే నాకూ చాలా ఇష్టం. అలా మూడు వందల సోవియట్‌ ఇంగ్లీష్‌ పిల్లల పుస్తకాల్ని సేకరించాను. వీటిలో సుమారు రెండు వేల జానపద కథలున్నాయి. ఈ పుస్తకాలతో 'సోవియట్‌ సాహిత్యంలో ఓ సాయంత్రం' అన్న పుస్తక ప్రదర్శన కూడా నిర్వహించాను. మీలో ఎవరైనా ఆ పుస్తక ప్రదర్శన చూశారా?

నేను సేకరించిన పుస్తకాల్లో నన్ను బాగా ఆకట్టుకున్నది 'సోవియట్‌ జానపద కథలు' అనే పుస్తకం. నాకెంతో ఇష్టమైన ఆ పుస్తకాన్ని నేనే అనువాదం చేసి మీకు అందించాలన్న తపన కలిగింది. ఈ కథలు మిమ్మల్ని బంగారు కలల ఊహాలోకంలో విహరింపచేస్తాయి. మిమ్మల్ని రంగుల ప్రపంచంలోకి తీసుకువెళతాయి. పిల్లల కథల మీదున్న ప్రేమే నన్ను అనువాదకుడిని చేసింది. - అనిల్‌ బత్తుల

పేజీలు : 78

Write a review

Note: HTML is not translated!
Bad           Good