హాయ్‌ పిల్లలూ... గుర్రానికి ఎనిమిది కాళ్ళేంటి...? రెక్కలెక్కడైనా ఉంటాయా...?! ఈ గుర్రమేదో స్పెషల్‌గా ఉందే అనుకుంటున్నారా...! అవును ఈ గుర్రానికి స్పెషలుంది. మీరు వెళ్తానంటే ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది.

మనం అంకెలు చదువుతాం, రాస్తాం, కదా... వాటికి ప్రాణముంటే ఎలా ఉంటుంది... అవి తరగతి గదుల్లో ఇంచక్కా మీలాగ ఆడుకొని, పాడుకొని, పోట్లాడుకుంటే ఎలా ఉంటుంది...? ఊహించుకోండి...! భలే ఉంటుంది కదూ...! ఆ ప్రపంచంలో అంకెలు చేసే సందడేంటో చూడాలంటే ఈ ఎనిమిది కాళ్ళ రెక్కల గుర్రాన్ని ఎక్కి ఆ ప్రపంచంలోకి వెళ్లాల్సిందే.. ఆలస్యమెందుకు.. వెళ్దామా మరి....!?

Write a review

Note: HTML is not translated!
Bad           Good