ప్రపంచంలో ప్రసిద్దమైన చరిత్ర గల దేశాలలో భారతదేశం ఒకటి. క్రీస్తుకు పూర్వం 10 వేల సంవత్సరాల నాటికే భారతదేశంలో జన సంచారం బాగా ఉందని తెలుస్తుంది ఆనాటి ప్రజలు వ్యవసాయం చేసేవారు. పసువులను పెంచేవారు. సమూహాలుగా నివసించేవారు. ఇటుకలతో ఇళ్ళు నిర్మించుకునేవారు.క్రీస్తుకు పూర్వం మూడువేల సంవత్సరాలనాడు భారతదేశం సిందు నదీ ప్రాంతంలో నగర జీవనం ఉండేదట. |