తెలుగునాట నవలల్ని విశేషంగా చదివింపచేసే అలవాటు చేసిన రచయితల్లో మాదిరెడ్డి సులోచన ఒకరు. ఆనాడు కాల్పనిక ప్రభావంతో రచనలు చేసిన వారిలో ఈమె ఒకరు. ఊహాజనిత చిత్రణ కంటే వాస్తవిక జీవిత చిత్రణకు ప్రయత్నించారు.

చిగురాకులలో చిలకమ్మ :

మతం మార్పిడితో మారుపేరుతో తమ ఇంటికే అల్లుడిగా వచ్చిన తమ్ముడిని చూచి నిర్ఘాంతపోయింది భారతి.

అక్కని గుర్తుపట్టినా, ఆమె ఎవరో తెలియనట్లు ప్రవర్తించేసరికి భారతి హృదయం గాయపడింది. అతడు తన తమ్ముడనే వాస్తవాన్ని బైటికి చెప్పుకోలేక, ఆ అబద్ధంలో జీవించలేక, రెక్కలు తెగిన పక్షిలా విలవిల్లాడి పోయింది.

భారతి ఆ ఇంటికెలా చేరింది? ఆమె తమ్ముడు ఎందుకు మతం మార్చుకున్నాడు.

అపార్థాలు, అనుమానాలనే సుడిగుండాల్లోంచి భారతి బైటపడగలిగిందా?

సుప్రసిద్ద రచయిత్రి శ్రీమతి మాదిరెడ్డి సులోచన సహజ సామాజిక నవల ''చిగురాకులలో చిలకమ్మ.'

పేజీలు : 192

Write a review

Note: HTML is not translated!
Bad           Good