కథ రాయడం వేరు, జీవితాన్నే కథగా మలుచుకుంటూ రావడం వేరు. మొదటిది కల్పనాశక్తిమీద ఆధారపడి ఉంటే, రెండోది జీవితమనే సముద్రంలోని ముత్యాలని ఏరగలిగే  సమర్థతమీద ఆధారపడి ఉంటుంది. ఒక్కోసారి ఆల్చిప్పలూ అందంగానే ఉంటాయి. అది వేరే కథ.

ఎవరి జీవితం వారికి గొప్పదీ, అద్బుతమైనదే.

కానీ 'అబ్బ! ఎంత గొప్పగా ఉందీ!' అని పాఠకుడి చేత అనిపించుకునేదే అద్బుత రచన అవుతుంది. పాఠకుడిని తనతో పాటు తీసికెళ్ళగలిగేదే మనసుకి హత్తుకునే రచన అవుతుంది.

ఈ 'చిగురాకు రెపరెప'ల్లో మనం చూసేది అదే!

పోలీస్‌ మావయ్య - రివాల్వర్‌ కథ, ఇవన్నీ ఓ పక్క 'భావచిత్రాలు'గా మనసుని బంధిస్తే, 'యంగ్‌మెన్స్‌ హేపీ క్లబ్‌' నాటి మహామహుల్ని (అంజలీదేవిగారు, ఆదినారాయణరావుగారు, సత్యంగారు, రేలంగి, ఎస్‌విఆర్‌... ఇలా ఎందరినో, సూర్యకాంతంగారిదీ కాకినాడే!) జ్ఞప్తికి తెస్తుంది.

Pages : 112

Write a review

Note: HTML is not translated!
Bad           Good