మనిషికి పెట్టని కవచంగా నిలబడి అన్ని దశల్లోనూ మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తున్న చెట్టు ప్రతిభను వెల్లడిచేస్తూ, వివిధ అంశాలతో, మనిషి హితం కోసం కూర్చిన 30 కథల సమాహారం ఈ 'చెట్టు చెప్పిన కథలు'.

కథలు చదవగానే చెట్ల గురించి మనం ఇన్ని విషయాలు తెలుసుకుంఆమా! అని ఆశ్చర్యం కూడా కలుగుతుంది.

కష్టపడితే ప్రతి చెట్టూ కల్పవృక్షమే, తాను మోసపోయిన విధానాన్ని తెలిపి, తెలివిని పెంచిన చేతి కందని పంట, సులభంగా వంటబట్టే దురలవాట్లు పిల్లల్లో పెకిలించలేని చెట్టుగా మారిన విధానం, చెట్లను నరికి వ్యవసాయం చేసి పరశురాముడు చెట్లకు నీళ్లు పోస్తున్న శ్రీరామ చంద్రుడి మౌన సందేశం గ్రహించిన వైనం, మర్రిచెట్టు లాంటి ఓ మనిషి  స్వభావాన్ని నర్మగర్భంగా వివరించిన పద్ధతి. ఇలా ఎంత చెప్పినా తనివి తీరని కథలు. చదువుతూ వుంటే పీచుమిఠాయిలా చూపుల్లో కరిగి పోయే సరళాక్షరాల పద విన్యాసపు సులభ శైలి - ఈ కథలకు ప్రధాన ఆకర్షణ.

Write a review

Note: HTML is not translated!
Bad           Good