పెద్దవాళ్ళకి కథలు రాయటం తేలిక. చిన్నపిల్లలకు కష్టం. చెప్పదల్చుకున్న పెద్ద విషయాన్ని చిన్న చిన్న మాటల్లో గుజ్జనగూళ్ళు కట్టటం మరీ కష్టం. శారదాదేవి గారు కథ చెప్పిన తీరు బాగుంది. కథనం అద్బుతంగా వుంది. నీతి కథలు ఎవ్వరు ఎన్నిసార్లు చెప్పినా వినవచ్చు, చదవొచ్చు. శారదాదేవి గారు ఉపాధ్యాయురాలు కాబట్టి పిల్లల మనసుకి హత్తుకునేలా కథలు చెప్పగలిగారు.     - ప్రయాగ రామకృష్ణ
    ప్రతి కథలో సరళమైన భాష, మృదువైన పదాల పొందిక, రమ్యార్థ స్ఫురణతో కూడుకున్న భావాలు కనిపిస్తాయి. కథల పేర్లు శీర్షికలుగా రచయిత్రి బొట్టుపెట్టిన తీరు చాలా ఆకర్షణీయంగా వుండటమే కాక అర్థవంతంగా నీతిబోధకంగా వున్నాయి. మానవీయ విలువల్ని చాటి చెప్తాయి. ప్రతి కథలో విలువైన కథాంశంతో పాటు కథనం కూడా అత్యంత మనోహరంగా పాఠకుల్ని అలరిస్తుంది. - మల్లెల నరసింహమూర్తి
    నేటి బాలలే రేపటి సమాజ నిర్దేశకులు కాబట్టి నేడు బాల్యానికి మంచి మాటలు, మంచి కథలు చెప్పి, మంచి మార్గం చూపితే రేపటి సమాజం, భాష, సంస్కృతి, సంప్రదాయాన్ని కాపాడిన వారమౌతామనే ఆరాటం ఈ రచయిత్రిలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. లోతుగా ఆలోచిస్తే ఈ 'చేతవెన్నముద్ద'లో ప్రతి కథలోనూ ఆ విషయాన్ని మనం గమనించవచ్చు.
Pages : 75

Write a review

Note: HTML is not translated!
Bad           Good