చెహోవ్‌ (1860-1904) తన జీవితకాలంలో ఎనిమిది వందల దాకా కథలు రాశాడంటారు కొందరు. చిన్న కథల్నీ, స్కెచ్‌లనూ కలిపి వెయ్యికి పైగా రాశాడంటారు మరికొందరు. ఈ అభిప్రాయ భేదం సంఖ్య గురించే. అతడు రాసినన్ని అద్భుతమైన ఆణిముత్యాల్లాంటి కథలు మరెవ్వరూ రాయలేదనటాన్ని గురించి మాత్రం అందరిదీ ఏకాభిప్రాయం.

కఠిన పరిశ్రమకు అలవాటు పడిన పశ్చిమ దేశాల రచయితలు / విమర్శకులు కూడా చెహోవ్‌ చేసిన కృషిని చూసి ఆశ్చర్యపోతారు. అతడి ఉత్తరాలు, నోట్‌బుక్స్‌ కూడా తరువాతి తరాల రచయితలకు పఠనీయ గ్రంథాలైనాయి. అతడి రచనల్ని యితర భాషల్లోకి అనువదించిన వాళ్ళకు లెక్కలేదు. అవే కథలు, అవే నాటకాలు - కాని యించు మించు ప్రతీ పదేళ్లకూ ఓ కొత్త అనువాదం వస్తుంది - కొత్తతరం పాఠకుల కోసం. వందేళ్ళ తర్వాత కూడా నిత్య నూతనంగా ఉన్నాయి చె¬వ్‌ రచనలు.

- ముక్తవరం పార్థసారథి

Write a review

Note: HTML is not translated!
Bad           Good