చీకట్లోంచి చీకట్లోకి' అనుభూతిలో జనించి సహజ రూపం సంతరించుకున్న నూతన సాహిత్య ప్రక్రియ. యిందులోని ఐదు కథలు నిదానించి విడివిడిగా నిశితంగా చదివితే ఏ కథకాకథ ఒక మంచి కథ. ఐదూ కలిపి మన భావవేగంతో సమానంగా స్పందిస్తూ చదివితే ఒక స్త్రీ నిండు జీవితాన్ని ప్రత్యక్షంగా చిత్రించే సజీవ నవల.

అయిదు సంఘటనల్నీ ఏకం చేసి అందులో ఐక్యం అయి దర్శించ గలిగితే తన్మయపరిచే ఒక విషాద నాటకం.

తెలుగు సాహిత్యంలో ఒక సంచలన కెరటం వడ్డెర చండీదాస్‌, హిమజ్వాల, అనుక్షణికం, నవలు ద్వారా తెలుగు పాఠకులకు సుపరిచితులైన ఆయన కొన్ని కథలు కూడా రాశారు. ఈ తరం సాహిత్య పాఠకులకు ఈ కథలు కొత్తవి. కుటుంబం, వివాహవ్యవస్ధలనే చట్రల్లోని డొల్లతనం ఏమిటో ఈ కథలు చెప్పకనే చెబుతాయి. - వార్త 

Write a review

Note: HTML is not translated!
Bad           Good