'చీకటిలో నీడలుంటాయా?'

ఈ ప్రశ్నకు జవాబు ఈ నవల పూర్తిగా చదివిన పాఠకులే ఇవ్వగలరని నా నమ్మకం.

నీడ పడాలంటే ఇంతో, కొంతో వెలుగు వుండాలి. మసక చీకట్లో నడుస్తూ, భవిష్యత్తు గురించి భయపడే బతుకుల్లో కనిపించీ కనిపించని నీడలుంటాయి. అలా మనసుని గాయపరిచే నీడల వంటి నిజాలు చీకటివెలుగుల మద్య చిక్కడిపోతే, ఆ నీడలని ఎక్కడైనా దాచేద్దామనే ప్రయత్నం చేయడం, ఎవరికీ కనబడకుండా చీకటి ముదిరిపోయి అంథకారం పెనవేసుకుపోతే బాగుంటుందని అనుకోవడం సహజం. అలాంటి సమయాల్లో యాదృచ్ఛికంగా చీకట్లు ముసిరితే, ఆ చీకటిలో తమని బాధపెడుతున్న భయంకరనిజాలని దాచేసి, మిగిలిన జీవితాన్ని ప్రశాంతంగా నడిపించాలనుకోడం స్వార్థమా, కాదా అన్నదే జవాబు లేని శేష ప్రశ్న.

Pages : 191

Write a review

Note: HTML is not translated!
Bad           Good