మన బతుకులు మారాలంటే తిరగబడాల...పిడికిలి బిగించాల...' అని కుశాలన్న పాలేటికి ఉపదేశం చేస్తున్నప్పుడు రచయిత ఒక మాట చెబుతాడు.
''ఆ మాటలు కురుక్షేత్రంలో పార్థుడికి కృష్ణుడు చేసిన గోతోపదేశంలా అనిపించింది పాలేటికి' అని. నిజానికి ఈ విషయం రచయిత గుర్తు చేయకపోయినా పెద్ద నష్టం ఉండేది కాదు. ఎందుకంటే, ఒక ప్రసిద్ధ చిత్రకారుడు 'గీతోపదేశం' చిత్రాన్ని అద్భుతంగా చిత్రించిన తరువాత, బొమ్మకింద 'గీతోపదేశం' అని అక్షరాల్లో రాయవలసిన పనిలేదు. రచయిత చెప్పక ముందే పాఠకుడు ఇక్కడ గీతోపదేశం దృశ్యాన్ని అందుకున్నాడు. పాఠకుణ్ణి రచయిత ఆ స్థాయికి తీసుకువెళ్ళగలిగాడు. ఇది రాసాని సాధించిన ఇంకో విజయం.
చిత్తూరు జిల్లాలో ప్రతి ఏడాది క్రమం తప్పకుండా 'భారతం ఆడటం' అనే ఒక ప్రత్యేక సంస్కృతి వందల సంవత్సరాలుగా ఉంది. ఈ భారతం ఆట ఈ వ్యవస్ధను ఏ మాత్రం ముందుకు జరిపిందో చెప్పలేనుగాని, రాసాని చెప్పిన ఈ సరికొత్త భారతం చిత్తూరు జిల్లాలోనే కాదు, దాని ఎల్లలు కూడా దాటుతుంది. సమాజం మార్పుకోసం మరో గీతోపదేశం చేస్తుంది. రాసాని సాహిత్య ప్రస్థానంలో రాబోయే విజయపరంపరలో ఈ నవల ఒక మలుపుగా మిగులుతుంది.- ఆచార్య మేడిపల్లి రవికుమార్‌

Write a review

Note: HTML is not translated!
Bad           Good