విశ్వ వ్యాపిత విప్లవస్పూర్తికి ప్రతీకగా, విప్లవకారులకు ఉత్తేజంగా నిలిచిపోయిన వ్యక్తి చేగువేరా. వైద్యుడై వుండి సమాజ రుగ్మతలకు సమూల శస్ర్త చికిత్స చేసేందుకు ఆశయాన్ని ఆయుధంగా ధరించిన యోధుడు. సన్నిహితులకు మరపురాని నేస్తం. అయితే చే అనగానే స్పూరించే భావాలు ఆయన వ్యక్తిత్వ సమగ్ర చిత్రణ ఇచ్చేవి కావు. మొదటి సారిగా చే రచనల సమగ్ర సంపుటిని లెప్ట్వర్డ్ ప్రచురించింది. ఇవి ఆయన జ్ఞాపకాలు కావు, భావాలు. క్యూబా విప్లవ చరిత్ర, అందులో తన పాత్ర, ఆపైన నూతన సమాజ నిర్మాణం ఈ దశలన్నిటినీ చే భాషలో చెప్పే అమూల్యమైన పుస్తకం ఇది. ఆయా సందర్బాల్లో రాసిన లేఖలు కూడా ఇందులో చూడచ్చు. |