ప్రపంచ ప్రసిద్ధ గెరిల్లా పోరాట యోధుడు ‘‘చే గువేరా’’

అర్జెంటీనాలో జన్మించి లాటిన్‌ అమెరికా దేశాలలో మోటార్‌ సైకిల్‌ యాత్ర చేసి అక్కడి సామ్రాజ్యవాదం అణచివేతను గుర్తించి గాటిమాలో ఉద్యమంలో పాల్గొని క్యూబాలో ఫెడల్‌ కాస్ట్రోకి బాసటగా నిల్చి దాన్ని విజయవంతంచేసి కాంగోలో గెరిల్లా యుద్ధాన్ని నడిపి బొలివియా గెరిల్లా యుద్ధంలో మరణించిన వీరుడు చేగువేరా. అతడు గెరిల్లా పోరాటంలో మరణించలేదు. సామ్రాజ్యవాదానికి ఫెడల్‌ కాస్ట్రో కంటే చేగువేరానే బద్ధ శతృవుగా ఎంచి తన సీక్రెట్‌ ఏజెన్సీ ద్వారా అతడిని కనుగొని బంధించి పాశవికంగా హత్య చేసింఇ అమెరికా. మరణంతో అతడి ఆశయం మరణించలేదు. అతడు లాటిన్‌ అమెరికా విప్లవోద్యమాలకు స్ఫూర్తి అయ్యాడు. నేడు ఉత్తరకొరియా అణ్వాస్త్ర తయారీ అమెరికా సామ్రాజ్యవ్యతిరేక పోరాటానికి కూడా అతడే స్ఫూర్తి. ఎలాటి దోపిడీ అయినా సాయుధ పోరాటమే మార్గమని తలచి, ‘టైమ్స్‌’ పత్రిక 20వ శతాబ్దం వరకు ప్రపంచ ప్రభావశీలురల్లో ఒకడిగా గుర్తించబడిన మేధావి చేగువేరా. అంతేకాదు, అతడొక డాక్టర్‌. ఒక రచయిత. ఒక మార్క్సిస్ట్‌. ఒక వ్యూహకర్త. ఒక పాలనా దక్షుడు. అతడి జీవితం యువతకు ఆదర్శం.

పేజీలు : 190

Write a review

Note: HTML is not translated!
Bad           Good