చావుకి చిరునామా అనే పేరుని బట్టే ఈ సంపుటిలోని కథల ప్రత్యేకత తెలిసిపోతుంది. ప్రతీ కథలో హత్య(లు) ఉండటం లేదా అది జరిగే సూచనతో పూర్తవడం ఆ ప్రత్యేకత.  అనువాదంలో చేయి తిరిగిన మల్లాది వెంకట కృష్ణమూర్తి అనువాదం కనుక వెరైటీ ఇతివృత్తాలు గల ఈ క్రయిమ్‌ కథలు హాయిగా చదివేయచ్చు.  సస్పెన్స్‌తో సాగుతూ ఇందులోని ప్రతీ కథా అనూహ్యమైన మలుపుతో పూర్తయి, మీరు అలవాటు పడ్డ తెలుగు రచయితల కథలకి విభిన్నంగా ఉంటుంది.  మంచి కథని చదివామనే తృప్తిని పాఠకులకి ఇస్తుంది.  దీన్ని బుక్‌ షెల్ఫ్‌లో సిద్ధంగా ఉంచుకోండి.  ఏం తోచనప్పుడు, ప్రయాణాల్లో, కాలక్షేపానికి చదవడానికి చావుకి చిరునామా మంచి పుస్తకం.

Write a review

Note: HTML is not translated!
Bad           Good