ఒకే ఒక్కడు అనిపించుకున్న క్యూబా అధినేత ఫైడల్ కాస్ర్టో సరసన మరొకడుగా నిలిచే అర్హత సంపాదించుకున్న ధీమంతుడు, ధీరుడు చావేజ్. అధిపత్య వ్యూహాలకు, ఆర్థిక పెత్తనాలకు లొంగిపోవడం కాదు, తిరగబడి నిలవడమే సమాధానమని ఆచరించి చూపినవాడు చావేజ్. ఆయన స్ఫూర్తితో లాటిన్ అమెరికా దేశాల స్వరూప స్వభావాలే మారిపోయాయి. ప్రపంచీకరణ యుగంలో ప్రైవేట్ కు ప్రజలకు బిలి చేయడం తప్ప గత్యంతరం లేదన్న వాదనను పటాపంచలు చేస్తూ ప్రజల పక్షాన నిలిచాయి. అమెరికా మెప్పు కోసం దేశ సార్వభౌమత్వాన్ని కూడా తాకట్టు పెట్టేందకు సిద్ధమైన ఎన్ డిఎ, యుపిఎ పాలకులకు హస్తిమశకాంతరమైన వైఖరి ఇది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good