సాహిత్యంలో ఒక రంగంలో కూలంకషంగా కృషి చేసేవారికి ఏదైనా అన్వయించగల శక్తి ఉంటుంది. హోమర్‌ ఒడిస్సీ నమూనాగా జోయిస్‌ చైతన్య స్రవంతి టెక్నిక్‌లో రాశాడని అందరికీ తెలుసు.

    చాసో ఒడిస్సీ చదివిన సాహితీరుడు కనుక యులిసిస్‌లోని ఘట్టాలని నాకు విడమర్చి చెప్పగల్గేవారు. - ఆరుద్ర

    ప్రకృతిని వర్ణనా చాతుర్యం చూపడానికో, ప్రకృతి మానవుడితో తాదాత్మ్యం చెందటాన్ని చూపడానికో (మన ప్రబంధాలలోనూ, కావ్యాల్లోలాగ) చాసో ప్రకృతిని తన రచనలో చూపలేదు. - ఆర్వీయార్‌

    మనదేశంలో పరంపరగా ప్రవహిస్తున్న మానవ సంస్కృతిని అవగాహన చేసుకొని, తమకాలంనాటి శిధిలమైన సాంప్రదాయాలని సమూలంగా పెకలించివేయాలనే దృక్పథంతో కలం పట్టిన రచయితలు గురజాడ, చాసో వంటివారు. తెలుగు కథా సాహిత్యంలో సామ్యవాద వాస్తవికతకి పాదులు వేసిన ద్రష్ట, స్రష్ట చాసో. - రామసూరి

Write a review

Note: HTML is not translated!
Bad           Good