చాసో కథలు

అంతర్జాతీయ సాహిత్యంలో నిలవదగిన కథలు రచించిన చాసో మార్క్సిస్టుతత్వాన్ని జీర్ణించుకొన్న జీవన దార్శనికుడు. రాశీ కన్నా వాసి మీద దృష్టి ఉన్న రచచిత.

చాసో ఏది రాయాలో ఏది రాయకూడదో బాగా తెలిసిన రచయిత. శిల్పం అంటే ఔచిత్యం. ఔచిత్యంలో రాయడానికి చాసో ఎంచుకున్న పద్ధతులు, ఆయనకి ఆయన తను సొంతంగా ఏర్పరచుకున్నవి ఆయన కథల్లో మనం గమనించవచ్చు. ప్రపంచ సామిత్యంలోని గొప్ప రచయితలను అధ్యయనం చేసిన చాసో ఎవరి ప్రభావానికి లోనుకాకుండా తనదైన, తనకే చెందిన రాసే విధానాన్ని సాధించారు. వస్తువు, సన్నివేశం, పాత్రల ప్రవర్తన, సంభాషణలు అన్నిటిలోనూ ఆయన చింతనా, ధృక్పథం అంతర్లీనంగా మొదటి నుండి చివరివరకూ ఉంటాయి.

ధనస్వామ్యంలో ధనం ఏ విధంగా మనుషుల్ని అవినీతిపరుల్ని చేస్తుందో, మానవత్వాన్ని ఎలా మంట కలుపుతుందో, బూర్జువా సమాజంలో మనుషులు ఎలా సంచరిస్తారో సునిశితంగా పరిశీలించి పాత్ర సృష్టి చేస్తారు. మోసం, దోపిడి, దౌర్జన్యం, అమాయకత్వం, అజ్ఞానం, మూఢనమ్మకం - అన్నిటినీ వ్యంగ్యంతో వ్యక్తీకరిస్తూ వ్యవస్థలోని అవకతవకలని ప్రశ్నిస్తూ వ్యవస్థమారాలి, మారడానికి వీలుగా వ్యక్తి ఆలోచన సాగాలి, వృద్ధి చెందాలని కళాత్మకంగా కథల్లో చెప్పారు.

అభ్యుదయ రచయితల సంఘం (అరసం) వ్యవస్ధాపకులలో ఒకరైన చాసో, కార్యవర్గ సభ్యులుగా, అధ్యక్షవర్గ సభ్యులుగా, 'అరసం' అధ్యక్షులుగా పలు బాధ్యతలు స్వీకరించి, ఉద్యమ నిమగ్నతకు పర్యాయపదంగా నిలిచారు.

చాసో భౌతికవాది. నిరీశ్వరవాది. తన మరణానంతరం తన పార్థివ శరీరాన్ని శాస్త్ర పరిశోధన నిమిత్తం దానమిచ్చిన గొప్ప మానవతావాది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good