అయిదువేల అయిదు వందల సంవత్సరాల క్రిందట భూమి మీద జీవించిన ఏ జంతునైన చరిత్ర పురా జంతువు అంటారు. అంటే మానవ జాతి తన చరిత్రను వ్రాత పూర్వకంగా నమోదు చేయటం ప్రారంభం కాకముందు భూమి పై సంచరించిన జంతువులన్నీ పురాజంతువులేన్న మాట. కొన్ని చరిత్ర పురా జంతువులు ప్రస్తుత భూమిమీద సంచరిస్తున్న ఆ పురా జంతువులు సంతతి వలెనె చాలా వరకు పోలికలు కలిగి వుంటాయి.
కానీ చాలా ప్రాచీన జీవులు, ప్రస్తుతం ఉన్న జీవుల పోలికలతో ఏ మాత్రం ఏకీభవించవు . పైగా చాలా విభిన్నంగా ఉంటాయి. డైనోసార్ లనే చరిత్ర పురా జంతువుల గురించి ప్రస్తుతం అనేక విషయాలు తెలుస్తున్నాయి. చరిత్రపురా కాలంలో జీవించిన డైనోసార్స్ లో కొన్ని 40 మీటర్లు పొడవు కూడా పెరిగినవి ఉన్నాయి. ఇప్పటి వరకు తెలిసిన జీవులలో అనే అతి పెద్దవి. ఇలాగే ఇంకా అసాధారణ మైన ఎరిగే సారీ నృపాలు 2.4 మీటర్లు పొడవు ఉండే సముద్రపు తేళ్ళు, శరీరమంతా వెంట్రుకతో కప్పబడి ఉండే మమ్మాత్ లు అని పిలువబడే రోమపూర్గ ఏనుగులు, వంటివి ఉన్నాయి. అయితే ఈ జంతువులు అన్నే ఏక కాలంలో జీవిమ్చాయని చెప్పలేము. అవి వేరు వేరు కాలాలలో జీవించి ఉండవచ్చు.
అతి ప్రాచీన కాలంలో నివశించిన జంతువుల అవశేషాలు 60 కోట్ల సంవత్సర కాలానికి చెందినవి. కొందరు పురాతత్వ జంతు శాస్త్రవేత్తలు సాధారణ, సూక్ష జంతువులు భూమి పై అంతకంటే కూడా ప్రాచీన కాలానికి చెందినవి. ఉంది ఉండవచ్చని భావిస్తున్నారు. బహుశా అవి వందకోట్ల సంవత్సరాల కాలంనాటివి అయి ఉండవచ్చు. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good