భారతదేశం వేదభూమి మాత్రమే కాదు విశేషంగా ''ఆయుర్వేద భూమి'' కూడా. ఆయుర్వేదభూమి అని ఎందున్నాను అంటే మూలికలతో, ఔషధులతో వైద్యం చేయడం అనేది ఈనాటిది కాదు. ఏనాటి నుండో మనదేశంలో ఉంది. అంతటి మహత్తర చరిత్ర గల ఆయుర్వేదాన్ని మనం ఆంగ్లేయుల రాకతో మర్చిపోయి ఆంగ్లవైద్యంమీద మోజు పెంచుకున్నాం. కానీ గొప్ప విశేషమున్నదేదీ దాచినా దాగదన్నట్లు మరల ఈ మధ్య ఆయుర్వేదం విశేష ప్రజాదరణ పొందుతోంది. అభివృద్ధిలో అన్ని దేశౄలకు మార్గదర్శకంగా నిలచిన అమెరికా, రష్యా వంటి సంపన్న దేశాలు సహితం మన ఆయుర్వేదాన్ని నేడు అవలంబిస్తున్నాయి అంటే అది మామూలు విషయం కాదు.

ఈ తరుణంలో ''చరకుడు'' అనే గొప్ప మహర్షిచే రచించబడిన ''చరకసంహిత'' అనే ఈ అమూల్యమైన గ్రంథ రాజాన్ని మరల సంస్కరించి గ్రాంధికంలో వున్న దీనిని వ్యావహారికంలోనికి కొద్దిగా మార్పులు, చేర్పులు చేసి ముద్రించడం జరిగింది.

ఈ పుస్తకంలో ప్రతి మనిషికి సాధారంణంగా వచ్చే జ్వరము మొదలుకొని అతికష్టసాధ్యంగా భావించేటువంటి అంటే మంచి అనుభవం ఉన్న వైద్యునిచే వైద్యం చేయిస్తే తప్ప తగ్గని మొండి జబ్బుల గురించి, వాటి స్వభావ, స్వరూప లక్షణాల గురించి, మహత్తరమైన యోగాల గురించి వివరించి వ్రాయడం జరిగింది. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good