ఛంఘిజ్‌ఖాన్‌ - తెన్నేటి సూరి

''ఛంఘిజ్‌ఖాన్‌ పరమక్రూరుడైన హంతక నియంత'' అన్నది జర్మన్‌ - అమెరికన్‌ చరిత్రకారుల పసికరల దృష్టి. ''ఛంఘిజ్‌ఖాన్‌ నా ఆదర్శ వీరుడ''న్నది జవహర్‌లాల్‌ ఆరోగ్యవంతమైన చూపు.

12,13 శతాబ్దాలలో మంగోల్‌ యుద్ధాల వెనక ఉన్న రాజకీయ, చారిత్రక స్థితిగతులను వివేచించి సరైన అంచనా వెయ్యగల సాహితీ చరిత్రకారులకు; సామాజ్య్రవాదాన్నీ, చుట్టుపట్ల ఉన్న దేశాల కుటిల రాజకీయాల నెదిర్చి - మంగోల్‌ జాతికేకాక ఆసియా ఖండానికే ఉజ్జ్వల భవిష్యత్తు అందించిన వెలుగుసూర్యుడూ, మ¬న్నత మానవతావాదీ ఛంఘిజ్‌ఖాన్‌.  ''మన చేతిలోని ఆయుధాన్ని నిర్ణయించేది శత్రువు చేతిలోని ఆయుధమే'' అన్న సూక్తే ఛంఘిజ్‌ఖాన్‌ చండశాసనపరత్వానికి కారణ భూతం కావచ్చు.

తెన్నేటి సూరి, తననాటికున్న వివిధ గ్రంథాల నాధారంగా చేసిన సాధికారిక రచన ఇది. ఎంతో నైపుణ్యంతో చరిత్రను కాల్పనిక కావ్యంగా తీర్చిదిద్దిన సందర్భం ఇది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good